పల్లవి:కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యె...హోవ నన్ (1)పరిశుద్ధుడా క్రీస్తులో ఎరిగితివి (2) - కరుణన్ (1)
1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని (2) గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను (2)
2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి
3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను
4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల
5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్ నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు
6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో (2) సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ
7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే పలుసంఘముల నిల స్థాపించెన్ - ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో