CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 632

లోకమునకు నన్ను దేవా నా దేవా

lokamunaku nannu devaa naa devaa

Matthew 5:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:లోకమునకు నన్ను (2) - దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి (1)అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి (1)
1. నరరూపధారి - పరలోక ఉప్పయి (2) ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి (2) అద్భుత దేవా నా దేవా - శుద్ధీకరించితివి (1)
2. యెరికో నీళ్ళ - వలె నా జీవం మరణచేదైయుండ నీవు - రుచిగా మార్చితివి అద్భుత దేవా నా దేవా - రుచిగా మార్చితివి
3. నా రోతహృదయం - నూతన పరచి పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు అద్భుత దేవా నా దేవా - నింపిన దేవుండవు
4. పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్ నిరతమునే జూపునట్లు - క్రుమ్మరించుము నన్ను అద్భుత దేవా నా దేవా - క్రుమ్మరించుము నన్ను
5. నీ నిత్యజీవం - నీ సంతోషం నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా - భద్రపరచితివి
6. దీనుడనై నే - బహుదుఃఖపడిన ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా మర్చుచున్న
7. జనులు నన్ను హింసించినపుడు ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్ అద్భుత దేవా నా దేవా - హల్లెలూయ పాడెదన్

Back to Hebron Seeyonu Geethalu