పల్లవి:జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా (2)
1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది (2)- భూదిగంతముల వరకు (2) సాక్షులుగా నుందు రనిన (2)
2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని తెచ్చెనతని యేసు కడకు
3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగెన్
4. మనము ప్రభుని సంబంధులము - లోబడె లోకము దుష్టునికి లోకము ప్రభుని ఎరుగవలెన్
5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున ధైర్యముతో చాటించెదము
6. ప్రభుని వాక్యము మన హృదయములో - వసియించుచున్నందున వాక్యమును ప్రకటించెదము
7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము చేసెదను యేసున కెప్పుడు హల్లెలూయ