CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 64

హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు

hallelooya naa praanamaa yehovaanu stutinchu

Psalms 146

More
Reference recording on YouTube ↗
పల్లవి:హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు (2)
1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను (2) నా బ్రతుకు కాలమంతయు - నా దేవుని కీర్తింతును (1)
2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కల్గదు వారిని - నమ్ముకొనకండి
3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు వారి సంకల్పములన్నియు నీ దినమే - నాశనము నొందున్
4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు
5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్ ఆ తండ్రి యెన్నండైన తన మా- - టలు తప్పనివాడు
6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్ ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్
7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్ పుట్టంధుల కన్నులను యెహోవా - తెరవజేసెడివాడు
8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే నీతిమంతుల నెల్లరిని - యెహోవా ప్రేమించున్
9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనే వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును
10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయును యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును
11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్

Back to Hebron Seeyonu Geethalu