CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 65

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

devuniki stotramu gaanamu cheyutaye manchidi

Psalms 147:1-20

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది (2)
1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని (2) ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని (2)
2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని
3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను వాటి కన్నియు పేరులు - పెట్టుచున్న వాడని
4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని
7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును
8. గుర్రముల నరులందరి - బలము నానందించడు కృపకు వేడువారిలో - సంతసించు వాడని
9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని
10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్ మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
11. భూమికి తన యాజ్ఞను - యిచ్చువాడు ఆయనే వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
12. వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని ఏ జనము కీలాగున - చేసియుండ లేదని

Back to Hebron Seeyonu Geethalu