పల్లవి:ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువావట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?
1. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?
2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్ వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు || ఒక్క ||
3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే || ఒక్క ||
4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా? || ఒక్క ||
5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ || ఒక్క ||