పల్లవి:మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా -యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్ (2)
1. యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము (2) నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు (2)
2. జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు నీ విపుడే యెరుగు దీనిన్ - జయమును పొందెదవు
3. సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో నీ విపుడే యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని
4. ఎవ రు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో నీ విపుడే యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్
5. తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్ నీ విపుడే - యెరుగు దీనిన్ విశ్రాంతి పొందెదవు
6. నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి నీ విపుడే - యెరుగు దీనిన్ లేచి పొందు ఘనత
7. అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత నీ విపుడే - పొందెదవు జీవకిరీటమును