CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 668

యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు

yesukreestu ninna nedu ekareetigane yunnaadu

Hebrews 13:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు (1)యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును (2)
1. అన్నిటికంటె ముందుగ నున్న (2)- అల్ఫాగ తానై యుండి (2) తనయందు మనల పూర్ణులజేసె (2)- ఓమెగ తానైయుండి (2)
2. లోకము పుట్టక మునుపే తాను - మహిమలో తండ్రితో నుండె ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె
3. అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి
4. జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు
5. నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్
6. అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్ మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి
7. ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో

Back to Hebron Seeyonu Geethalu