CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 671

యేసులో హర్షించెదము

yesulo harshinchedamu

Nehemiah 8:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసులో హర్షించెదము - మహిమలో హర్షింతుము నిరతం (2)మహిమ మహిమ మహిమలో హర్షించెదము (2)
1. పరిశుద్ధులు హర్షింప - యేసు త్వరగా రమ్మని పలుక (1) మారువారికి మకుటం - మనస్సారగ దేవుడిచ్చున్ (1) మహిమ ఘనము మహిమలో నానందింప (2)
2. శుద్ధ జీవులైన - దేవసుతులు ప్రకాశింపన్ సర్వ సృష్టియొక్క - మహా కర్మము లన్నియు తీర రాజుకు మహిమ కలుగు దినములు రాగా
3. దాసులెల్లరుకూడి - దేవుడిచ్చు మకుటము పొంది వేయి సంవత్సరముల్ - రాజ్యమేలుచుండునపుడు నెమలి, కోకిల, గొఱ్ఱె, పులితో వసించున్
4. చెదల పుడమి నశింప - నవభూమ్యాకాశముల్ కలుగ శాప పాపముల్ సకల - కడురోగము లెల్లను తీర సుఖము, జయముతో నెల్లరు నానందింప
5. బంగారు వీధులను - బహురంగుగా నొప్పుచుండున్ మెరయు వజ్రకాంతుల్ - కూడ నీవు చూచి హర్షింప క్లేశ, కన్నీరులేని నగరులోన
6. స్ఫటిక జీవనదియు - ఇరుప్రక్కల జీవ వృక్షమును ఆకలిదప్పులు లేక - నట జీవ ఫలముల భుజించి తినుచు, త్రాగుచు యేసులో నానందింప
7. పరిశుద్ధాత్మయు సుతుడు - చేసిన రక్షణ కార్యమును తండ్రి దూతల గణముల్ - నట చూచి ప్రహర్షింపన్ క్రొత్త కార్యముకొరకు ఆనందింప

Back to Hebron Seeyonu Geethalu