CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 673

ఆనందమే మనకిలలో మన కానందమే

aanandame manakilalo mana kaanandame

Matthew 28:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆనందమే మనకిలలో ఆ... ఆ... (2) - మన కానందమే ప్రభు లేచెన్ (1)ఆనందమే మనకిలలో (2)
1. పాపుల మిత్రుడు - పాప రహితుడు (2) - పాపులకొరకై - శాప గ్రాహియై (2) మోపుగ శాపము - వీపున మోసె పాపపు ఋణము తీర్చె (2)
2. పొంతిపిలాతు మసుఖమునందు - శాస్త్రుల పెద్దల యేదుటను నిలిచె స్తోత్రార్హుండు - మరణము గెలిచె - సైతానును ఓడించె
3. మరణము భయము - లేని వారమై - మరణమున్ గెల్చిన - యేసుని జేరి తరుణమును - పోగొట్టుకొనక - పరమ ప్రభువును చాటన్
4. లేచిన ప్రభువు ప్రియులను జూచి - గాంచెద నంచు అభయమునిచ్చె (2) తీసివేసెను - చింతయు నంతను - రోసెద మిపుడే లోకమున్
5. పరమునకేగి - పంపెనాత్మను - పరవశులైరి - శిష్యులు గదిలో కొరతలేని - శక్తిని పొందిరి - శిరముల - నెత్తిచాటిరి
6. మన ప్రభుయేసు వచ్చుచుండె - మనము రెప్ప పాటున మారి తనివి దీరగా - సంతసించి - వినయుని చేరెదము
7. మహిమ కిరీట ధారులమై - మహిమ వస్త్రములు ధరించి మహిమగల - రాజుతో నుండి - మహిని పాలించెదము

Back to Hebron Seeyonu Geethalu