పల్లవి:హల్లెలూయ పాట పాడెదము - హల్లెలూయ పాట పాడెదము (1)పాడెదము పాడెదము హల్లెలూయపాట (1)
1. మహిమ రాజు సన్నిధిన్ - మకుటధారులై నిత్యజీవ శాంతిలో - నిలిచియుందుము
2. శాంతి నాథుడేసుని - సముఖములో సంతసమే నిత్యము - చింత లేదుగ || హల్లె ||
3. నా ప్రభువు తుడుచును - నా కన్నీటిని ప్రేమతోడ మందను - పోషించును || హల్లె ||
4. సంతసమున దూతలు - సంస్తుతించగా పాడి మోక్షమందున - మోదమొందెదన్ || హల్లె ||
5. శత్రువునకు వెరువనేల - సోదరులారా దైవపుత్రులారా నిద్ర - లేచి పాడుడి || హల్లె ||
6. యేసురాక వార్త మ్రోగె - భాసురంబుగా వచ్చుచున్నాడేసు సంఘ - వధువు కొరకు || హల్లె ||
7. తెల్లవస్త్రములు లేక - వెళ్ళజాలవు రక్తములో కడుగును - వస్త్రములను || హల్లె ||