CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 676

దాహముగల వారెల్లరు నీళ్ళయొద్దకు రారండి

daahamugala vaarellaru neellayoddaku raarandi

Psalm 65:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:దాహముగల వారెల్లరు - నీళ్ళయొద్దకు రారండి (2)
1. దేవుని నది నీళ్ళతో నిండి - భువికి సారము నిచ్చుచున్నది - రారండి (2) దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు (2)
2. ఆనంద ప్రవాహ నదిలో - పానముతో దప్పి తీర్చును రారండి భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు
3. మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను - రారండి మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను
4. ప్రయాసభారము మోయువారు - యేసు నొద్దకు ఆశతోడను - రారండి తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి
5. సకలము సిద్ధముగా నున్నది - శక్తిగల దేవుని విందునకు - రారండి సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని
6. సత్యమును తెలిపెను ప్రభువు - ప్రత్యేక జీవము జీవింపను - రారండి ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి
7. దేవుని నది జీవజల నది - ప్రవహించుచున్నది పల్లమునకు - రారండి దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము

Back to Hebron Seeyonu Geethalu