పల్లవి:సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తిగల యేసు (1)హల్లెలూయ - ఆమెన్ (2)
1. పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు (1) కృపతో కౌగలించె నను యేసు - ఉపకారి నన్ను చేర్చె యేసు (2)
2. గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు ఆరాధికులకు పరిశుద్ధుడేసు - నిరాశగలవారి మిత్రుడేసు || సర్వంబులో ||
3. నాదు మార్గంబునకు వెలుగు యేసు - నాదు పాదంబులకు దీపము యేసు (1) నాదు దాహంబునకు పానము యేసు - నాదు యజ్ఞానంబునకు జ్ఞానము యేసు || సర్వంబులో ||
4. నాదు రోగంబులకు వైద్యుడు యేసు - నాదు బాధ్యతల వహించు నేసు నాదు ఏకాంతములో తోడు యేసు - నాకు తేనె కంటె బహు తీపి యేసు || సర్వంబులో ||
5. నాకు రక్షకుడు రక్షణ యేసు - నాకు విమోచకుడు విమోచ నేసు నాకు జీవంబును దేవుడు యేసు - నాకు నీతి నాదు వెలుగు యేసు || సర్వంబులో ||
6. నాకు మాదిరి వెంబడించ యేసు - నాకు ముందు నడచు నాయకుడేసు నాకు దుఃఖంబులో ఆదరణేసు - నాదు కష్టంబులో ధైర్యము యేసు || సర్వంబులో ||
7. నాదు హృదయంబున యున్నవాడు యేసు - నాదు వృద్ధికి కారకుండు యేసు నాదు కృంగుదలలో తోడనుండు యేసు - నాదు సర్వమందు నిల సర్వమేసు || సర్వంబులో ||