పల్లవి:ప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృపవెంబడి కృపను (2)
1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో (2) ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు (2)
2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచి సంతోషించునట్లు - నన్ను జ్ఞాపకముంచుకొనుము
3. నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా - నన్ను జ్ఞాపకముంచుకొనుము
4. దేవా నీ ప్రజల యెడల - దిన దినము నీకున్న ఘనుడా నీదు దయతో - నన్ను జ్ఞాపకముంచుకొనుము
5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును దినదినము నాకొసగి - నన్ను జ్ఞాపకముంచుకొనుము
6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు డనిన మహోన్నతుడా - నన్ను జ్ఞాపకముంచుకొనుము
7. ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను చేతుననిన ప్రభువా - నన్ను జ్ఞాపకముంచుకొనుము
8. కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూప\ హల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక