CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 687

కరుణా కరుడా

karunaa karudaa

Psalm 77:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది
1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు తిరిగి వచ్చెదరు సీయోనునకు
2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ సంతోషం అధికంబగును
3. మోక్షానంద భాగ్యము గలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ దుఃఖం నిట్టూర్పును పోవును
4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ ప్రభుని కొనియాడిరి బహుగా
5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము
6. మహోన్నతుడే మనకానందం మహా బలమగును గాక - అది మహిమార్థంబగును గాక
7. హల్లెలూయ ఎల్లరుపాడి హర్షింతుము ప్రభుయేసునిలో - మన - రక్షకుడేసుని పాడెదము

Back to Hebron Seeyonu Geethalu