CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 689

మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో

mana pattanambadigo mana pauratvambadigo

Philippians 3:20

More
Reference recording on YouTube ↗
పల్లవి:మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో -కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో (2)
1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో - ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి (2) మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము (2)
2. జీవ జలనది - పారు నాసనమునుండి - ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు నెల నెల కాయును - పండ్రెండు కాపులను
3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు - నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను
4. తేజోమయునితో - మరి తేజోవాసులతో - తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు సజీవ జనకుని - సజీవ జనులమని
5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు - కరువు మరణములు - కానము ఎన్నడును మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము

Back to Hebron Seeyonu Geethalu