CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 690

యేసువా నా ప్రియమైన

yesuvaa naa priyamaina

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను -భాసురముగ వేగవచ్చి కౌగలించవే (2)
అను పల్లవి:ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా (2) || యేసు ||
1. ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట - మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్ (2) ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము (2)
2. ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో - సదమలుండు ఉత్తముండు పురుషులలోన ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను
3. ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను - ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను విమల స్వరము వినగా నాశతీరెను "
4. లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే కౌగిలించుకొనును నన్ను వేగమే
5. వర్ష ఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో - వింతగాను పుష్పములు పూసియున్నవి సంతసమున రాజ్యమేల జేర్చును

Back to Hebron Seeyonu Geethalu