CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 696

నీతి సూర్యుండు ఉదయించు

neeti sooryundu udayinchu

Malachi 4:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (2)అతని కిరణములు ఆరోగ్యమిచ్చును (2)- రెక్కలతోనే కప్పును మనలన్ (2)నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (1)
1. కొలిమి కాలునట్లు కాల్చెడి దినము - తిలకించుము అది వచ్చుచున్నది (2) ఇల గర్విష్టులు దుష్టులెల్లరు - పాలుపొందెదరు అగ్నిగుండమున (2)
2. సైన్యములధిపతి సెలవిచ్చెను - ఖాయముచూడు నాశనదినము భయంకరమైనది తీర్పుదినము -చేయును నాశము రూపులేకుండ
3. దేవునికి మీరు భయపడినచో - పశ్చాతాపమొందు, పశ్చాతాపమొందు జీవము నొసగును సమృద్ధిగా - కరమునిచ్చి మిమ్ముకాపాడును
4. ప్రభు నియమించిన ఆ దినమురాగ - ప్రభు ప్రజలందరు తన సొత్తగుదురు ప్రభు కరుణించును పుత్రులుగా - అధికారమిచ్చును స్వాస్థ్యము నొసగి
5. క్రీస్తుని ప్రేమ అమూల్యమైనదియు - నిత్యము నిల్చెడి ఆత్మీయమైనది దుష్టులకొరకై ప్రాణమిడె - క్షమాపణ నొసగి విమోచించుతానే
6. ప్రభు ప్రజలారా శత్రుని తలను - విభుని సాయమున అణగద్రొక్కెదరు శత్రువులందరు దూళి అగుదురు - విజయానందము మీరు పొందెదరు
7. మరువకుడి ప్రభు మాటలెన్నడు - స్థిరముగనుండి సిద్ధపడుడి త్వరగా మహిమతో ప్రభు వచ్చున్ - పరమున మిమ్ము తనతోనుంచును

Back to Hebron Seeyonu Geethalu