పల్లవి:నీతి సూర్యుడు నీపై నుదయించును -అతని రెక్కలు నారోగ్యము నిచ్చును (2)
1. పాపపు టంధకారమందుంటిమి - శాప శిక్షపొంద తగియుంటిమి (2) దాపున జేరిన నీతి సూర్యుడు (2) - నీపై ప్రకాశించు నిత్యము (2)
2. కృపయు సత్యము యేసుద్వార కల్గెన్ - కృపనుబొందగ వేగమే రారమ్ము అపరిమిత కృపనుండి నీవు - కృపవెంబడి కృప బొందెదవు
3. వారాయన తట్టు తేరిచూడగా - వారి ముఖము బహు ప్రకాశించెను పరమ ప్రభును చూడు నీతి సూర్యుని - కిరణంబులు వెల్గునిచ్చును
4. మందిరమంత యెహోవా తేజస్సు - అందరు చూడ నిండి యుండెను సుందరమగు క్రీస్తు తేజస్సును - పొంది యారాధించి స్తుతించు
5. తన మహిమకు రాజ్యమునకును - మనలను పిలిచిన దేవునికి వినయముతోడ విధేయులమై - నడుచుకొందుము నిత్యము