CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 704

దేవుని కృప నిత్యముండును

devuni krupa nityamundunu

Psalm 136:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవునికృప నిత్యముండును - ఆయన కృప నిత్యముండును -స్తోత్రముచేసి స్తుతించి పాడి - హల్లెలూయా ఆర్భాటింతుము (2)
1. ఇరుకునందు నశింపకుండ - ఇంత వరకు కాచె మమ్ము (2) ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు - ఆయన కృప నిత్యముండను (2)
2. శత్రు సేనలు చుట్టుముట్టిన - దావీదు భక్తునిగాచిన దేవుడు ముందు నడచును ఆయన బలవంతుడు - ఆయన కృప నిత్యముండును
3. అగ్నిశోధన మనకు కలిగిన - ఆదరించి విజయమిచ్చి ఆర్భాటముతో మమ్ము నడిపించును - ఆయన కృప నిత్యముండును
4. గాఢాంధాకార లోయలో నడచిన - నా పాదములకు దీపమై యుండి నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు - ఆయన కృప నిత్యముండును
5. నీచులెందరో అపహసించిన - నెహెమ్యాకు తన ఆత్మనొసగె నిరతము మనకు ధైర్యము నిచ్చు - ఆయన కృప నిత్యముండును
6. నిత్యదేవుడు సత్యవంతుడు - నిత్యము మనకు జయమునిచ్చి ఉత్సాహముగా మము నడిపించెను - ఆయన కృప నిత్యముండును

Back to Hebron Seeyonu Geethalu