పల్లవి:ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు (2)ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ (2)
1. ఇహపరమందు - నివసించువారు - నీ నామమున మోకరింతురు (2) మహిమ పరతురు దేవుని (2) అంగీకరించు - ప్రతివాని జిహ్వ - నీవే క్రీస్తువనుచు (2)
2. అపారమైన - క్రియలు చేయుచు - మమ్మెల్ల పరిపాలించుచున్నావు ప్రేమ గల ప్రభువా పాపిని రక్షింప - యిహమున కరిగి - గొప్ప రక్షణనిచ్చె
3. ఐగుప్తు నుండి - విడిపించిన వారిని - నలువది వత్సరములు నడిపించితివి కాచితివి కనుపాపగ ఉంచియున్నావు - మాదిరిగా వారిన్ - నీ ఆలోచన గొప్పది
4. పరమును తెరచి - మన్నా కురిపించి - అందరికి జీవజలమిచ్చితివి పొందిరి తృప్తి నీయందు అగ్ని స్తంభము - మేఘ స్తంభమును - నిత్యము నడిపించును
5. తుఫానురేగి - నిరాశపరచ - శత్రువు మా మధ్య చెలరేగగ మమ్ములను రక్షించితివి వాగ్దానములు - నెరవేర్చి నీవే - స్వాస్థ్యము నిచ్చితివి