CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 717

ఓహో! యెరూషలేమా

oho! yerooshalemaa

Hebrews 11:10

More
Reference recording on YouTube ↗
1. ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను జీవంపు భోజనము నీతోను తిందుము
2. సీయోను కొండపైన దూతాళి భక్తులు ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో
3. విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున జయంబు గొన్నవారు - నిత్యంబు నందున శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై
4. ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు

Back to Hebron Seeyonu Geethalu