పల్లవి:నేనే భయపడ వలదని పలికెను - మన రక్షకుడు యేసుప్రభు (2)
1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా (2) తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు (2)
2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు
3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు
4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్ త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ
5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె
6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము