CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 721

ప్రియయేసు రాజునునే చూచిన

priyayesu raajunune choochina

Psalm 17:15

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రియయేసు రాజునునే చూచిన చాలు - మహిమలో నేనాయనతో నుంటే చాలు (1)నిత్యమైన మోక్షగృహమునందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు (2)
1. యేసుని రక్తమందు కడుగబడి - వాక్యముచే నిత్యం భద్ర పరచబడి (2) నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను (2) బంగారు వీధులలో తిరిగెదరు (2)
2. దూతలు వీణులను మీటునపుడు - గంభీర జయధ్వనులు మ్రోగునపుడు హల్లెలూయ పాటలు పాడుచుండ ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్
3. ముండ్ల మకుటంబైన తలను జూచి - స్వర్ణకిరీటం బెట్టి యానందింతున్ కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్
4. హృదయము స్తుతులతో నింపబడె - నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ వర్ణింప నా నాలుక చాలదయ్యా
5. ఆహా యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా నాయాశ యెపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో ఆశతో వేచియుండె నా హృదయం

Back to Hebron Seeyonu Geethalu