పల్లవి:యెహోవా నైన నేను మార్పు లేని వాడను గాన -యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు (2)
1. దేవుడెహోవ మనుష్యుడు కాడు (2) - మాట మీరని వాడు (2) పశ్చాత్తాప పడడే మాత్రం (2) - అబద్ధమాడ నేరడు (2)
2. నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు
3. యాకోబు దేవుని నామము - నిన్ను ఉద్ధరించును గాక ఆపత్కాలమందున నీకు ఉత్తరము - నిచ్చును గాక
4. సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింప కిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు
5. గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడై పర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు
6. మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచు సీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు
7. లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమును లోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు"