పల్లవి:యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2)తరతరములకు యుగయుగములకు మార్పులేనిదిపరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే - మహిమ రాజ్యమది (2)
1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2) కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2) ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)
2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము సూర్యచంద్రులు లేని రాజ్యము ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్ ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే