CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 76

ఆద్యంతరహితుడవగు మాజ్యోతి

aadyantarahitudavagu maajyoti

Isaiah 9:6

More
Reference recording on YouTube ↗
1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి - మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము (2) మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము నా దీన కాపరి నీతి కృపానిధి - శుధ్ధ దివ్యగత్రుడా ఆ.. ఆ.. ఆ.. (2)
2. మనోహరమగు నీ కృప పొందను - మానవు లెల్లరము చేరితిమి మానవు లెల్లరము చేరితిమి ఆత్మరూపా కృపామయా నీ కరుణా - వరముల మాకీయుమా ఆ.. ఆ.. ఆ.
3. పాలచే కడుగబడిన - ధవళాక్షుడా - వళ్లి పూలయందు తిరుగువాడా వళ్లి పూలయందు తిరుగువాడా షాలేము రాజా షారోను రోజా - శాంత భూపతివి నీవే ఆ.. ఆ.. ఆ..
4. లక్షల దూతల స్తుతుల నందువాడా - అక్షయ హేమమకుట ధారుడా అక్షయ హేమమకుట ధారుడా హేమ కిరీటధారులమై స్వర్గంబు - చేర కడవరి వర్షమీ ఆ.. ఆ.. ఆ..
5. క్రొత్త యెరూషలేం నగర రాజా - రత్నాల పునాది వేసితివి రత్నాల పునాది వేసితివి ధీరతతో నీ సాక్ష్యము చాటను - స్థిరమగునాత్మ నిమ్ము ఆ.. ఆ.. ఆ..
6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన - ఇష్టంపురూప లావణ్యవతీ ఇష్టంపురూప లావణ్యవతీ అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము - పాత్రులుగా చేయుమా ఆ.. ఆ.. ఆ..

Back to Hebron Seeyonu Geethalu