CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 766

యెహోవాను స్తుతించుడి మీరు

yehovaanu stutinchudi meeru

Ecclesiastes 11:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాను స్తుతించుడి - మీరు యెహోవా నామమును స్తుతియించుడి (1)
అను పల్లవి:యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి (2) || యె ||
1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్ (2) నేటి దినమున వినెడి మీరు (2) ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు (1)
2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు భూమ్యాకాశములందున లేడని
3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు సొలొమోను నందా వాగ్దానములను కన్నుల విందుగ నెరవేర్చెనుగా
4. పోవుడి, పోవుడి, తొలగిపోవుడి అపవిత్రమైన దేని ముట్టకుడి యెహోవా సేవోప కరణములను మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి
5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన ఉన్నతమైన స్థానమందుండి ఘనుడైనవాడై హెచ్చింపబడును
6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై సీయోను! నీ దేవుడేలు చున్నాడని సమాధానమును ప్రకటించు పాదములు
7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొఱ్ఱపిల్ల సింహాసనముండు సేవింతురు తన దాసులాయనను రవి తేజులై దివి రాజ్యమునందు

Back to Hebron Seeyonu Geethalu