CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 767

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం

kraistava jeevitam saubhaagya jeevitam

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రైస్తవ జీవితం - సౌభాగ్య జీవితం - ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
అను పల్లవి:కష్టములు వచ్చిన - నష్టములు వచ్చినా -యేసు ప్రభువే నా సహకారి || క్రైస్తవ ||
1. ఈ లోక ఘనత - నన్ను విడిచినన్ - లోకస్థులెల్లరు - నన్ను విడిచినన్ నా సహోదరులు - నన్ను విడిచినన్ యోసేపు దేవుడే - నా సహకారి
2. అంధకారంబు భువి - నావరించిన - రాజులు ఘనులు - శత్రువులైనను అగ్నిగుండములో - సింహపు గుహలో దానియేలు దేవుడే - నా సహకారి
3. నా మంచి కాపరి - శ్రేష్ఠ స్నేహితుడు - శాశ్వత రాజు - నా సహాయకుడు భారం నాకెందుకు - వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో - నేకీర్తించెదన్
4. బూర శబ్దంబు - మ్రోగెడి వేళ - శ్రమ నొందిన నా - ప్రభుని చూచెదన్ ఏనాడు ఎప్పుడు - నీవు వచ్చెదవు ఆనాటి వరకు - నే కనిపెట్టెదన్

Back to Hebron Seeyonu Geethalu