CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 770

దైవదాసులారా మీరు దీక్షతోడ

daivadaasulaaraa meeru deekshatoda

More
పల్లవి:దైవదాసులారా మీరు దీక్షతోడ రారండిప్రభు క్రీస్తుని నిజ సేవకులారా
1. నిత్యుడగు క్రీస్తు ప్రభువు - సత్యసంఘమును గూర్చి యిచ్చినట్టి దర్శనమందు - కట్టబడగ రండి
2. లేవీయుల పరిచర్యల - వివరము నెరిగియుండి సేవకుల పరిచర్యలను- వలదను వారు ప్రబల
3. క్రీస్తుయేసు రక్తమిచ్చి - కొన్నట్టి సంఘమందు అపోస్తులులు అధికారమందు ప్రభువును సేవించెదము
4. దేవుని ఎదుట యోగ్యునిగాను - సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనుపరచుకొనను - జాగ్రత్త పడవలెను
5. యిర్మియా, జెరుబ్బాబేలు - ఎజ్రా, నెహెమ్యా ల ధీరతన్ జూచి భీతిని వీడుము - స్తెఫను, పౌలు ల వలెను
6. వాడబారని మహిమ కిరీట - మివ్వను వచ్చుచున్న ప్రధాన కాపరి రాకడ దినమాయె - శ్రద్ధతో మందను కాయన్
7. సంఘ దర్శనమొందిన - నిజదైవ దాసులకై సహవాసమందు నేర్పిన సత్యముకై - హల్లెలూయ పాడెదం

Back to Hebron Seeyonu Geethalu