పల్లవి:పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునోనా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో
1. ఆకలిదప్పులు - దుఃఖము - మనోవేదన - లేదచ్చట పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను
2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును
3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను
4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును
5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె