పల్లవి:సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా (1)వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండపై (2)సిలువే నీ గురిగా (1)
1. మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు? (2) యేసు ప్రభుండే - దాటించువాడు (2) - నీదు చుక్కాని యేసే (2)
2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ అక్షయుడు తెరచె నిశ్చయముగ - మోక్షద్వారము నీకే
3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు
4. ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లములకు ప్రియమైన యేసే - శాంతి నిచ్చెడి రాజు