పల్లవి:ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా (2)నీతిజ్ఞానము కలవాడా (2) జ్యోతికి నిలయము నీవే (2)
1. అబ్రాహామును పిలిచితివి - ఆ వంశమున బుట్టితివి (2) అనాధులకు దిక్కు నీవే (2) - అనాధుడవై వచ్చితివి (2)
2. ఇస్సాకును విడిపించి - యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి - పాపులకై మరణించితివి
3. యోనావలె మూడు దినముల్ - భూగర్భమున నీవుండి మానవులను రక్షింప - మహిమతోడ లేచితివి
4. పండ్రెండు గోత్రముల - జెంది - పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను - కన్యను వరించితివి
5. దావీదు కుమారుడవు - దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు - పాపిని నన్ను ప్రేమించి