పల్లవి:యెహోవా నా కాపరి - లేమి కలుగదుపచ్చికలపై పరుండజేయుచున్నాడు (2)
1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు (2)
2. సర్వదా నాదు ప్రాణంబునకు -సేద దీర్చుచున్నాడు యెహోవా
3. తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు
4. చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను
5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న - న్నాదరించి తోడై యుందువు
6. నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు
7. నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది
8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము - నిత్యమెహోవా మందిరములో నుండెద