CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 9

నీవే యెహోవా నా కాపరివి

neeve yehovaa naa kaaparivi

Psalms 23:1-6

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీవే యెహోవా నా కాపరివి (2)- నాకేమి కొదువ - లేదిలలోన (2)
1. పచ్చికగలచోట్ల - నన్ను జేర్చి - స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి (2) నా ప్రాణమునకు - సేదను దీర్చి (2)- నన్ను నడుపుము నీతిమార్గమున (2)
2. గాఢాంధకార లోయలయందు - పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దుడ్డుకర్ర - దండముతో నీ వాదరించెదవు
3. శత్రువుల యెదుట నీవు నాకు - నిత్యమగు విందు సిద్ధపరచి నాతల నూనెతో నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది
4. నిశ్చయముగా - కృపా క్షేమములే - వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరమున - స్థిరముగా నే నివసించెదను

Back to Hebron Seeyonu Geethalu