CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 84

స్తోత్రింతుము నిను మాదు తండ్రి

stotrintumu ninu maadu tandri

John 4:24

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో, ఆత్మతో నెపుడు (2)
అను పల్లవి:పరిశుద్ధాలంకారములతో - దర్శించెదము శరణం శరణం (2) || స్తో ||
1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున (2)త్రిత్వమై యేకత్వమైన - త్రిలోక నాథా శరణం శరణం (2)
2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం
4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం
5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం
7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే - నమస్కారములు ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం
8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు - వేడుకొందము శరణం శరణం
9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు శుభము శుభము శుభము నిత్యం - హల్లెలూయా ఆమేన్ ఆమేన్

Back to Hebron Seeyonu Geethalu