పల్లవి:దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను - అశ్రద్ధ చేయకుడి (2)తనకు పరిచర్య చేయుటకు (1) - 'మిమ్మేర్పరచుకొనెన్' (2)
1. పవిత్రమైన హృదయముతో - శుద్ధ మనస్సుతోను (2) దేవుని సన్నిధిలో నిలుచుంది - ధూపము వేయుటకు (2) 'మిమ్మేర్పరచుకొనెన్'
2. అశ్రద్ధ వలన శాపము నష్టము లెన్నో పొందితిరి ఆసక్తితో మీరు పరిచర్య చేసి - 'దీవెనలు పొందుడి 'దీవెనలు పొందుడి'
3. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి జగత్తు పునాది వేయక ముందే - 'మిమేర్పరచుకొనెన్' ‘మిమ్మేర్పరచుకొనెన్'
4. క్రీస్తుకు దాసులమని యెరిగి - దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించి - 'దేవుని ఘనపరచుడి' 'దేవుని ఘనపరచుడి'
5. వాని వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును దేవుని దృష్టికి నీతిమంతులై - 'సేవ జేయుడి' 'సేవ జేయుడి'
6. కోతెంతో విస్తారమాయె - కోయువారు లేరు వాక్య ఖడ్గమును చేబూని - 'లేచి రండి నేడీ' - 'లేచి రండి నేనే'