పల్లవి:ఆకాశమందు - నీవుండగ, నేను ఎవరికి - భయపడనునీవీలోకములో - నాకుండగ నేను దేనికి - భయపడను
1. శత్రు సమూహము - నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప జూసిన నా సహవాసిగ - నీవుండగ నేను ఎవరికి - భయపదను
2. వ్యాధులు, కరువులు - శోధనలు, బాధలు దుఃఖము - వేదనలు మరణము మ్రింగగ - కాంక్షించిన, నేను దేనికి - భయపడను
3. మహిమైశ్వర్యము - వైభవము, మహిమానందము - మారనివి నా ప్రభు క్రీస్తే - నాకుండగ, నేను ఎవరికి - భయపడను
4. నా తీర్మానము - నే చేసితి, నా ప్రభు యేసును - నమ్మితిని అనుభవ మిచ్చును - ఆ ప్రభువే, నేను ఎవరికి -భయపడను
5. పడిపోయిన వెను - కంజ వేయక, పశ్చాత్తాపము - పడి అడుగు నిన్ను క్షమించును - నీ ప్రభువే, నీవు ఎవరికి - భయపడవు