CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 854

భూదిగంతముల నివాసులారా

bhoodigantamula nivaasulaaraa

More
పల్లవి:భూదిగంతముల నివాసులారా - నా వైపు చూచి రక్షణ పొందుడియిదియే దేవుని ఆహ్వానము - యిదియే దేవుని రక్షణ పిలుపు
1. వినిరి అనేకులు ఆ పిలుపును - లోబడిరి వారు ఆ పిలుపునకు (2) యేసుని వైపు చూచిరి వారు (2) రక్షణనొంది ఆనందించిరి
2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి - ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి యేసుని వైపు చూచుచుసాగిరి ఆత్మతో సత్యముతో ఆరాధించిరి
3. సుళువుగా చిక్కులు బెట్టు పాపమును విడువుడి - సిలువను సహించి సాక్షులైయుండుడి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించెడు యేసుని చూడుడి
4. పరిశుద్ధత మీద మీరు - మిమ్మును కట్టుకొనుడి - పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుడి నిత్య జీవార్ధమైన కనికరమునకై యేసుని కొరకు కనిపెట్టు చుందుడి
5. దేవుడను నేనే యనె - వేరెవ్వరు లేరనెను - నీతిమంతుడును - రక్షించు వాడును యుగయుగములకు-మహిమ ఘనత ప్రభావమాయనకే కలుగును గాక

Back to Hebron Seeyonu Geethalu