పల్లవి:నమ్మదగిన మా దేవా - పరిశుద్ధుడా, నీతిమంతుడా (2)మహామహిమలో వసియించెడు - మహిమగల మహారాజా (2)
1. మా పాపములను మే మొప్పుకొనగా - క్షమియించితివి నమ్మదగినవాడవై (2) నీ రక్తముతో ప్రతిపాపమును (2) - కడిగి శుద్ధులుగా చేసిన దేవా (2) నిన్ను మేము పూజింతుము (2)
2. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు - నమ్మకమైన సత్యసాక్షినై ఆదియు అంతములేనివాడా - మృతుడై సజీవుడుగా లేచినవాడా నిన్ను మేము కీర్తింతుము
3. శత్రువు మాపై చెలరేగుచుండగా - అండగా నుండి మమ్మాదుకొంటివే నీ నమ్మకత్వము మేమెన్న తరమా - మాటతప్పని మహోపకారీ నిన్ను మేమారాధింతుము
4. గాలి తుఫానుల కల్లోలములతో- మా నావ అలలచే అల్లాడుచుండగా గాలి తుఫానులు గద్దించితివే - మము దరిచేర్చిన మహానుభావా నిన్ను మేము స్తుతియింతుము
5. పది దినములు శ్రమ కలుగునంటివి - నమ్మకముగ నుండు మరణము వరకని జీవకిరీటము నిచ్చెదననిన - మొదటివాడవు కడపటివాడా నిన్ను మేము ఘనపరతుము
6. పిలిచితివి మమ్ము నీ కుమారుని - సహవాసమునకు నమ్మదగినవాడవై పరిశుద్ధమైన పరలోక పిలుపుతో - నీ విశ్వాస్యత బుద్ధి కందదే వందనములు చెల్లింతుము
7. వచ్చుచున్నవాడు నమ్మకమైన - సత్యవంతుడను నామము గలవాడు దేవుని వాక్యమును నామము గలవాడు - రాజులరాజు ప్రభువుల ప్రభువు హల్లెలూయ (అమేన్ (2)