పల్లవి:విజయులం - ఘన విజయులం (2)క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)
1. పరమును వీడి ధరకేతెంచి - మరణించితివి కలువరి సిలువలో (2) నీతి మంతులుగా మము తీర్చితివి (2) నూతన జీవము మాకిచ్చినందున
2. మరణ బలము నుండి విడిపించితివి - మరణ భయములను తొలగించితివి మరణము గెల్చి తిరిగి లేచితివి - సమాధి నిన్ను గెలువకపోయెను
3. శత్రు సైతానును ఓడించి - నీ సంఘమును నిర్మించితివి పాతాళ ద్వారముల్ నిలువకుండా - నీ సంఘమును కాపాడుచుంటివి
4. గొల్యాతు లెందరో హేళన చేసిరి - బబులోను రాజులు పైపైకి లేచిరి కనానీయులు కత్తులు దూసిన - యెరూషలేమును కాయుచున్న దేవా
5. శ్రమయు బాధ హింస యైనను - కరువు వస్త్ర హీనత యైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను - యెడ బాపునా మమ్ము యేసు ప్రేమ నుండి
6. లోకము శరీరము దాడి చేయుచుండగా - లోకమున్ జయించిన విజయశాలివి లోకస్థులపై విజయము నిచ్చి - విజయ విశ్వాసులుగా చేసిన దేవా
7. మహా గొప్ప మహిమతో మరల వచ్చెదవు - శత్రువు సేనలు కలవరపడగా నీ రాజ్యమును భువిపై నిలిపి - మమ్మేలు దేవా యుగా యుగములు