పల్లవి:యేసు క్రీస్తు దేవుని శక్తియు - జ్ఞానమునైయున్నాడు (2)
1. సిలువ వార్త నశించువారికి - వెర్రితనము-గా నున్నది (2) రక్షింపబడువారికి - అది దేవుని శక్తి (2) నమ్మువారిని రక్షించుట (2) దేవుని దయా - సంకల్పమాయెను (2)
2. మనలా రక్షింప - అనాది నుండి - దేవుని సంకల్పమైయున్నది తన కుమారుని - అర్పించే దేవుడు - ఆయనే మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనమాయెను
3. మన విశ్వాసమునకు - దేవుని శక్తిని - ఆధారముగా చేసికొనుడి మానవ జ్ఞానము విడిచిపెట్టుడి - పరిశుద్ధాత్మతో - దేవుని శక్తిని దేవుని పనిలో వినియోగించుడి
4. దేవుడు మనలను - తన సంఘములో - జతపనివారుగాను చేసె పనివాడు కష్టము కొలది - జీతము పొందును మనము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నాము
5. దేహము దేవుని వలన - అనుగ్రహింపబడి - పరిశుద్ధాత్మకు ఆలయమాయెను మీరు మీ సొత్తుకారు - విలువపెట్టి కొనబడినారు మీ దేహములతో - దేవుని మహిమపర్చి రాకడ కొరకు కనిపెట్టుచుండుడి