CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 864

క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా

kreestesu prabhuni vishvaasulamugaa

More
పల్లవి:క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా -కడముట్టించెదము ఈ జీవితయాత్ర (2)తానుండు చోటనే మనముండెదము (2)ఇదియే మన మహిమ నిరీక్షణ (2)
1. తానే మార్గం, సత్యం జీవమును - తన ద్వారానే పరదైసును చేరెదము (2) పరమునకు వెళ్లినాడు మన స్థలము సిద్ధపరచ రానైయున్నాడు మరల మనల కొనిపోవుటకు (2)
2. విడువడు మనల అనాథలనుగ నెప్పుడు - మనలో ఉండి మనతో నివసించును పాటింతుము ఆజ్ఞలు ప్రేమింతుము తండ్రిని ప్రభువును ఎదుర్కొన సిద్ధముగా నుండెదం
3. ప్రభురాకడ సమయం సమీపించుచున్నది ప్రొద్దుగ్రుంకు వేళనో అర్థరాత్రి వేళనో తెల్లవారు జామునో ఎరుగరు ఎవ్వరు జాగురుకులమైయుండి మేల్కోని ప్రార్థింతుము
4. ప్రభువేతెంచును ప్రభావముతో మహిమతో మేఘారూఢుడై వచ్చుట చూచెదము తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అనుగ్రహించును నీతికీరీటము
5. ఎంత గొప్ప భాగ్యము ఆ పరమ నివాసము- నిత్యమైన మహిమలో దైవ సహవాసము వెలలేని క్రయమిచ్చి వారసులుగా జేసితివి చెల్లింతుము ప్రభు కృతజ్ఞతాస్తోత్రములు

Back to Hebron Seeyonu Geethalu