పల్లవి:అర్పింతు ప్రభువా నా జీవితం - సామర్థ్యము గల నీ చేతిలోనిన్ను మహిమ పరచ అర్హపాత్రగా చేయుము నన్ (2)
1. నే మట్టిని నీవు కుమ్మరివి - నీ సామర్థ్య హస్తముతో లేపు (2) అయోగ్యతలన్నీ తొలగించి - నీ కోర్కె చొప్పున నన్ను చేయు నిన్ను మహిమపరచ గోరితిన్ ప్రభువా, యోగ్య పాత్రగ చేయుము నన్ (2)
2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ - నా చుట్టూ కంచెను కోల్పోతిన్ కానరాలేదు ఫలమేమి నాలో - వ్యర్థపరచితిని భూమిన్ నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా, ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము
3. నే అణచబడిన చిన్న చెట్టున్ - ముండ్ల పొదల మధ్య పడితిన్ ధనసుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను నానుండి ముండ్లను తీయుము ప్రభువా, నూరంతలుగా నే ఫలియింప
4. నా యెడల శాంతము చూపితివి - మరి యొక్క వత్సరమిచ్చితివి తోట మాలిగా నాకై వేడితివి - తప్పించితివి తీర్పునుండి వ్యర్థతీగెలను నరికి వేయు ప్రభువా, నే ఫలియించి నిను ఘనపరచ