పల్లవి:యెహోవాను గానము చేసెదము యేకముగా (1)మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము (1)ఆయనను వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు (1)
1. యుద్ధశూరుడెహోవా - నా బలము నా గానము (2) నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా (2)
2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా
3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని
4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను
5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు
6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి