పల్లవి:ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందుమహాదానంద మానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు
అను పల్లవి:నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో (2)ఉద్భవించె నద్భుతముగ (2) || మహాదానంద||
1. ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు (1) నీవు - ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు (1) అందుచే నీతోటి వారికంటె (2) - ఆనంద తైలముతో తండ్రి నిన్ను2 అధికంబుగ నభిషేకించెను (2)
2. అంత్య దినముల యందున - ఆ - వింత కుమారుని ద్వారా ఈ - అంత్య దినముల యందున - ఆ - వింత కుమారుని ద్వారా మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను
3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠుడాయె
4. నీవు నాదు కుమారుడవు -నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు నీవు నాదు కుమారుడవు -నిన్ను ప్రేమించి కన్నాను నేను దండిగ తనయుని ముద్దాడుడి - నిండుగాయన నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి
5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను ఆ - విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు విమోచన మాయెను యేసు
6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై - యున్నావు నీవు అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై - యున్నావు నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించెను తండ్రి
7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును మహా దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు