పల్లవి:యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర (2)ఆశతో నీ చరణము చేర (4)
1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిని (2) నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి (2)
2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి
3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే
4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివే మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద
5. నిన్ను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే