పల్లవి:ఓ యువకులారా మనమందరమునిత్యము యేసుని స్తుతించెదము (2)
చరణం 1:గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను (2) - ఖ్యాతిగా నొసగె- మనకు (2)
స్తుతియించెదమేసుని (2)
నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2)
చరణం 2:శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
చరణం 3:ఎన్ని శోధనలు భువినున్న
తానె మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభు కాయున్ - నిత్యము నిలుచు మనతో
చరణం 4:శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా - ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
చరణం 5:కృంగిన యువకులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగయుగములు మన ప్రభుకే హల్లెలూయ గీతములతో