పల్లవి:ధన్య ధన్య ధన్య ప్రభుకు- తానే రక్షణ మన కొసగేనీ సన్నిధికి నడిపి - ప్రభువా- రాత్రింబవళ్ళు గాచితివి
చరణం 1:పగటిలో మేఘ స్తంభముగా- రాత్రిలో యగ్నిస్తంభముగా
రక్షకుడవుగా నుండి - ప్రభువా- సుఖశాంతితో గాచితివి
చరణం 2:వాక్యమన్నాతో పోషించి- బండ నీళ్ళను త్రాగించితివి
ఆత్మకు తృప్తినిచ్చి - ప్రభువా- శాంతిని నాకిచ్చితివి ||ధన్య||
చరణం 3:ఆత్మీయ సుందర హృదయములో- ఆత్మ ప్రాణ శరీరములో
ఆత్మీయ జీవ మొసగి - ప్రభువా- ఆత్మను మేల్కొలిపితివి ||ధన్య||
చరణం 4:కానునులోనికి తెచ్చితివి- పరిశుద్ధులతో జేర్చితివి
ప్రణుతించెదను నిన్ను - ప్రభువా- సాగిలపడి పూజింతున్ ||ధన్య||