పల్లవి:విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా (2)పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ (2)
చరణం 1:ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడు సమయములో (2)
ప్రేమతో జాలి దీన స్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి (2)
చరణం 2:ఆదాము హవ్వలు ఏదేనులో - ఆశతో ఆజ్ఞమీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి
చరణం 3:మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి
చరణం 4:స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు
ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితిని
చరణం 5:నీ మాటలు వినక యోనా - తర్షీషుకు తరలినపుడు
సముద్రములో ముసుగుచుండగ - చేపద్వారా దరిచేర్చితిని
చరణం 6:నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షింతిని
చరణం 7:మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ ఆత్మను నొసగితిని - హల్లెలూయ పాడెదను